ETV Bharat / bharat

80సార్లు ఉతికినా వైరస్​ను అడ్డుకునే పీపీఈ కిట్!

కరోనా నుంచి రక్షణకు ఉపయోగించే వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ కిట్లు) కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పునర్వినియోగ పీపీఈ కిట్లను రూపొందించినట్లు వెల్లడించింది తమిళనాడు కోయంబత్తూర్​కు చెందిన వస్త్ర తయారీ సంస్థ. 80 సార్లు శుభ్రం చేసిననప్పటికీ క్లోరిన్​ రీఛార్జి చేసుకుని కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసింది.

denim ppe kit
80 ఉతుకుల తర్వాతా వైరస్​ను అడ్డుకునే పీపీఈ కిట్
author img

By

Published : Jun 29, 2020, 2:57 PM IST

కరోనా నుంచి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో పీపీఈ కిట్ పాత్ర చాలా కీలకమైనది. ఈ కిట్​ను ఒకేసారి వినియోగించేందుకు వీలుంది. ధర కూడా ఎక్కువే. అయితే 80 ఉతుకుల తర్వాత కూడా వైరస్​ నుంచి రక్షణ కల్పించే పీపీఈ కిట్​ను తయారు చేసింది తమిళనాడు కోయంబత్తూర్​కు చెందిన వస్త్ర తయారీ సంస్థ. రెండు వారాల పాటు దీనిని వినియోగించవచ్చని తెలిపింది. దక్షిణ భారత వస్త్ర పరిశోధనా సంస్థ (సిట్రా) నుంచి తమ ఉత్పత్తికి ఆమోదం లభించినట్లు ప్రకటించింది.

"మా పీపీఈ కిట్​లో క్లోరిన్​ను మేళవించాం. ఉతికినప్పటికీ వస్త్రంపై క్లోరిన్ తయారై.. వైరస్​ను నిరోధిస్తుంది. మొదటిసారి శుభ్రం చేసినప్పుడు ఎంత క్లోరిన్ ఉంటుందో 80వ ఉతుకులోనూ అంతేస్థాయిలో రీఛార్జి అవుతుంది."

-కేజీ డెనిమ్, వస్త్ర తయారీ సంస్థ డైరెక్టర్

denim ppe kit
పునర్వినియోగ పీపీఈ కిట్లను తయారుచేస్తున్న సిబ్బంది

ప్రస్తుతం ఉపయోగిస్తున్న పీపీఈ కిట్లను ఒకరోజు మాత్రమే వినియోగించడానికి వీలవుతుంది. వీటిని పునర్వినియోగించడం కుదరదు. ఉపయోగించిన అనంతరం శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అయితే పీపీఈ కిట్లను కూడా చెత్తవ్యానుల్లోనే తరలిస్తున్నారు. దీనిపై వైద్య వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకే ఈ పునర్వినియోగ పీపీఈ కిట్లను రూపొందించినట్లు తెలిపింది సంస్థ. తమ పీపీఈ కిట్లలో సాంకేతికత సాయంతో వస్త్రంలోనే క్లోరిన్​ను నిక్షిప్తం చేశామని.. ఇది 99.5 శాతం బాక్టీరియా, వైరస్​లను అడ్డుకుంటుందని చెప్పారు కేజీ డెనిమ్.

ఇదీ చూడండి: పీపీఈ కిట్టుతో.. ఇక ధైర్యంగా టికెట్టు కొట్టు!

'రానున్న రోజుల్లో పీపీఈ కిట్ల వినియోగం తప్పనిసరి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.