ETV Bharat / bharat

ఆ ప్రాజెక్టులతో 6 రాష్ట్రాల వలస కూలీలకు ఉపాధి - garib kalyan rojgar abhiyan news

రైల్వే శాఖ చేపట్టబోయే 160 మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన 6 రాష్ట్రాల్లోని వలస కార్మికులకు ఉపాధి లభిస్తుందని రైల్వే బోర్డు ఛైర్మన్​ తెలిపారు. ఇటీవలే ప్రారంభమైన 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ అభియాన్​' కార్యక్రమం ద్వారా ఈ మేరకు ప్రయోజనం పొందుతారన్నారు.

Returnee migrants to get employment in 160 railway infrastructure development works in 6 states
160 రైల్వే ప్రాజెక్టులు- 6 రాష్ట్రాల వలస కార్మికులు
author img

By

Published : Jun 27, 2020, 1:19 PM IST

కరోనా సంక్షోభం కారణంగా సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన 6 రాష్ట్రాల్లోని వలస కార్మికులకు 160 రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఉపాధి లభిస్తుందని రైల్వే బోర్డు ఛైర్మన్​ వినోద్​ కుమార్​ యాదవ్ వెల్లడించారు. రైల్వేలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేపట్టబోయే ఈ ప్రాజెక్టులతో ఇటీవలే ప్రారంభమమైన 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ అభియాన్'​ కార్యక్రమం ద్వారా 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఇందుకు సంబంధించిన వివరాలు పేర్కొన్నారు.

" బిహార్, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, ఒడిశా, ఝార్ఖండ్​ వ్యాప్తంగా 116 జిల్లాల్లో సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 160 రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఉపాధి లభిస్తుంది. మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనులకు 8వేల 828మంది కార్మికులు అవసరం. జూన్​ 20న పనులు ప్రారంభమయ్యాయి. 125 రోజులపాటు కార్మికులు ఉపాధి పొందుతారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.1888 కోట్లు "

-వినోద్ కుమార్​ యాదవ్, రైల్వే బోర్డు ఛైర్మన్​.

కరోనా కష్టకాలంలో అత్యవసరమైన వైద్యపరికరాలు, ఔషధాలు, ఆహార సరఫరా కోసం రైల్వే శాఖ ప్రత్యేక సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తోందని తెలిపారు వినోద్. కొవిడ్​ రోగులకు చికిత్స కోసం 5231 రైల్వే బోగీలను ఐసోలేషన్​ వార్డులుగా మార్చినట్లు వివరించారు. వలస కార్మికుల కోసం జాన్​ 25 నాటికి 4594 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు పేర్కొన్నారు. మొత్తం 62.8 లక్షల మంది వీటిలో ప్రయాణించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.