ETV Bharat / bharat

'మెట్రో కూతతో గ్రామాల్లో వైరస్​ వ్యాప్తి తీవ్రం!'

కరోనా కేసులు గణనీయంగా పెరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్​ 7 నుంచి మెట్రో సర్వీసుల పునఃప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉందని ఐసీఎమ్​ఆర్​ అధికారి డా. గిరిధర్​ జ్ఞాని.. 'ఈటీవీ భారత్'​తో ముఖాముఖిలో హెచ్చరించారు.

ICMR official
'మెట్రో కూతతో గ్రామీణంలో వైరస్​ వ్యాప్తి మరో స్థాయిలో'
author img

By

Published : Sep 1, 2020, 3:34 PM IST

దేశంలో మెట్రో రైలు సర్వీసులు పునఃప్రారంభిస్తే వైరస్​ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెద్ద నగరాల చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​ వ్యాప్తి అధికమవుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్​) సీనియర్​ అధికారి డా. గిరిధర్​ జ్ఞాని తెలిపారు. ఈటీవీ భారత్​తో పలు కీలక విషయాలు వెల్లడించారు.

'మెట్రో కూతతో గ్రామీణంలో వైరస్​ వ్యాప్తి మరో స్థాయిలో'

"పెద్ద నగరాల చుట్టూ ఉన్న గ్రామాల్లో కొత్త కేసులు అధికమవుతాయి. నగరాల్లో జనసంచారం ఎక్కువవడమే ఇందుకు కారణం. రహదారుల వెంట ఉండే గ్రామాలు, జిల్లా కేంద్రాలు, మెట్రో ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కేసులు వస్తాయి."

- డా. గిరిధర్​ జ్ఞాని, ఐసీఎంఆర్​ సీనియర్​ అధికారి

సెప్టెంబర్​ 1 నుంచి అమలైన అన్​లాక్-4 మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 7 నుంచి మెట్రో రైలు సేవల పునఃప్రారంభానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

గాలిద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే వాయుప్రసరణ సరిగా లేని, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్​ ఎక్కువకాలం గాలిలో ఉండే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయని డా. గిరిధర్​ అన్నారు.

సెరో సర్వేలో...

మే లో ఐసీఎంఆర్ చేసిన సెరో సర్వేలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లోని మురికివాడల్లో వైరస్​ సోకే ప్రమాదం 1.89 రెట్లు ఎక్కువని తేలింది. ​నగరాల్లోని ఇతర ప్రాంతాల్లో ఇది 1.09 రెట్లు ఎక్కువ.

డబ్ల్యూహెచ్​ఓ, ఎన్​సీడీసీ, రాష్ట్ర ఆరోగ్యశాఖల సహకారంతో ఐసీఎమ్​ఆర్.. ఈ సర్వే నిర్వహించింది.

గ్రామీణ ప్రాంతాల్లోనే...

ప్రస్తుతం వైరస్​ వ్యాప్తి ట్రెండ్​ చూస్తే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరిగాయి. కరోనా వైరస్​ వచ్చిన మొదటి నెలలతో పోలిస్తే ఈ ట్రెండ్​ పూర్తి భిన్నంగా ఉంది. మొదట్లో దిల్లీ, ముంబయి, చెన్నై వంటి వెద్ద నగరాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉండేది.

అయితే ఆగస్ట్​ నెలలో వెలువడిన మొత్తం కేసుల్లో సగానికి పైగా 584 జిల్లాల నుంచే వచ్చాయి. అయితే ఇందులో అత్యధికం గ్రామీణ ప్రాంతాలే.

ప్రమాదకరంగా...

ప్రస్తుత లెక్కల ప్రకారం రోజుకు 70 వేల కేసులతో భారత్​లో కరోనా పరిస్థితి అత్యంత ప్రమాదకంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక కేసులున్న జాబితాలో భారత్​ కన్నా ముందు అమెరికా, బ్రెజిల్​ మాత్రమే ఉన్నాయి.

దేశంలోని 739 జిల్లాల్లో 711 జిల్లాల్లో ఇప్పటికే వైరస్​ వ్యాప్తి ఉంది. ఇందులో పేద గ్రామీణ ప్రాంతాలు 100 ఉన్నాయి.

"గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య ఆరోగ్య సదుపాయాలు లేకపోయినప్పటికీ పరీక్షల సామర్థ్యం పెంచాలి. దేశంలోని తొమ్మిది పెద్ద రాష్ట్రాలైన బిహార్​, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్, ఉత్తర్​ప్రదేశ్, మహారాష్ట్ర, బంగాల్, ఒడిశా, గుజరాత్​లోని పలు జిల్లాల్లో కొత్త అంటువ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉన్నట్లు లాన్​సెట్​ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామం ఆరోగ్యాన్నే కాకుండా సామాజిక- ఆర్థిక పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది."

- డా. గిరిధర్​ జ్ఞాని, ఐసీఎమ్​ఆర్​ సీనియర్​ అధికారి

జాగ్రత్తలు...

మెట్రో సర్వీసుల్లో ప్రయాణాలు చేసేవారు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని డా. గిరిధర్​ సూచించారు. పరీక్షలు చేయించుకోవడానికి వెనుకంజ వేసేవారి వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుందన్నారు. అయితే గుర్తించలేని కరోనా కేసులే.. సూపర్​ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.