ETV Bharat / bharat

కశ్మీర్:18వ రోజూ అంతర్జాల సేవల నిలిపివేత

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్​లో విధించిన ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తున్నారు అధికారులు. ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణ సముదాయాలు తెరుచుకోలేదు. మొబైల్​, అంతర్జాల సేవల నిలిపివేత వరుసగా 18వ రోజూ కొనసాగుతోంది.

కశ్మీర్:18వ రోజూ మొబైల్​, అంతర్జాల సేవల నిలిపివేత
author img

By

Published : Aug 22, 2019, 2:41 PM IST

Updated : Sep 27, 2019, 9:18 PM IST

కశ్మీర్:18వ రోజూ మొబైల్​, అంతర్జాల సేవల నిలిపివేత
అధికరణ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్​లో విధించిన ఆంక్షలు క్రమక్రమంగా సడలిస్తున్నప్పటీ.. అంతర్జాల సేవల నిలిపివేత వరుసగా 18వ రోజు కొనసాగుతోంది. తాజాగా మరిన్ని ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. జన జీవనం మెరుగవుతోంది. కానీ చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణాలు తెరుచుకోలేదు.

కశ్మీర్​ లోయలో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బలగాల మోహరింపు కొనసాగుతుందని తెలిపారు.

ప్రజారవాణాకు నో..

కశ్మీర్​లో ఆంక్షల సడలింపుతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కానీ ప్రజా రవాణా ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాల మధ్య తిరిగే క్యాబులు, ఆటోలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి.

విద్యార్థుల గైర్హాజరు...

ప్రభుత్వ ఆదేశాలతో కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నప్పటికీ... విద్యార్థుల గైర్హాజరు కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళనతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు.

ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై భాజపా దేశవ్యాప్త ప్రచారం

Intro:Body:

Today's 18th day situation in Valley 

Conclusion:
Last Updated : Sep 27, 2019, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.