రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి, ఆయన భార్యపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ముంబయిలో ఇంటినుంచి స్డూడియోస్కు కారులో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు వెల్లడించారు ఆర్నబ్.
అయితే... ఈ ఘటనలో ఆర్నబ్ దంపతులు గాయాల్లేకుండా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పాత్రికేయులారా కరోనాతో జాగ్రత్త: జావడేకర్