భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి సందడి చేయనుంది. జనవరి 26న దిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక రఫేల్ యుద్ధ విమానం పాల్గొని వర్టికల్ ఛార్లీ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం వెల్లడించింది.
వర్టికల్ ఛార్లీ ఫార్మేషన్‌లో యుద్ధ విమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈసారి గణతంత్ర వేడుకల్లో వాయుసేనకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన 4 విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు.
ఇదీ చూడండి: 'భారత్-పాక్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు'