ETV Bharat / bharat

'సరిహద్దు సమీప ప్రజలను ఎక్కడికీ పంపించట్లేదు!' - India china border standoff

చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది సైన్యం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయటం సరైనది కాదని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని అరుణాచల్​ప్రదేశ్​, అసోం ప్రజలను కోరింది.

Indian army
'సరిహద్దు సమీప గ్రామాలు ఖాళీ చేయటం అవాస్తవం'
author img

By

Published : Sep 10, 2020, 10:09 AM IST

భారత్​, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ)కి సమీపంలోని గ్రామాలు ఖాళీ అవుతున్నాయన్న వార్తలను ఖండించింది భారత సైన్యం. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం హానికరమని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని అరుణాచల్​ప్రదేశ్​, అసోం ప్రజలను కోరారు తేజ్​పుర్​ రక్షణ శాఖ ప్రజాసంబంధాల అధికారి.

"ఎల్​ఏసీ సమీప గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారన్న వార్తలు అవాస్తవం. తప్పుడు వార్తలను నమ్మొద్దని అరుణాచల్​ప్రదేశ్​, అసోం ప్రజలను కోరుతున్నాం. ఏ సమాచారం అయినా రీట్వీట్​ చేసే ముందు సంబంధిత అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలి."

- పీఆర్​ఓ, రక్షణ శాఖ తేజ్​పుర్​

తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతల నేపథ్యంలో అరుణాచల్​ప్రదేశ్​ తవాంగ్​లోని మెక్​మోహన్​ రేఖకు సమీప గ్రామాలు ఖాళీ అవుతున్నట్లు మీడియా నివేదికల నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది సైన్యం.

సరిహద్దులో దురాక్రమణలకు ప్రయత్నిస్తున్న చైనాకు దీటైన సమాధానం చెబుతోంది భారత్​. ఇటీవల పాంగాంగ్​ సరస్సు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక పర్వతాలను స్వాధీనం చేసుకుని చైనా కంగుతినేలా చేసింది సైన్యం. దౌత్య, సైనిక, రక్షణ మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ.. సమస్య కొలిక్కి రావటం లేదు. గురువారం(సెప్టెంబర్​ 10న) రష్యా వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు.

ఇదీ చూడండి: 'అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా'

ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా చైనా దుశ్చర్యలు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.