భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ ద్వితీయ వర్ధంతి నేడు. మహానేతకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్తున్నారు.
భారత పురోగతిలో వాజ్‌పేయీ పాత్ర అమోఘమని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన సేవలను దేశ ప్రజలూ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని ట్వీట్ చేశారు. దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం 'సదైవ్ అటల్' వద్దకు చేరుకొని.. ఆయనకు నివాళులర్పించారు.
-
Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd
— Narendra Modi (@narendramodi) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd
— Narendra Modi (@narendramodi) August 16, 2020Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd
— Narendra Modi (@narendramodi) August 16, 2020
"దేశాభివృద్ధికి వాజ్‌పేయీ చేసిన సేవలు చిరస్మరణీయం. ఎల్లప్పుడూ వాటిని భారత ప్రజలు గుర్తుంచుకుంటారు."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... సదైవ్ అటల్‌కు చేరుకొని వాజ్‌పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
"ఉదార ప్రజాస్వామ్య విలువలను మోసే 'అజాతశత్రువు', జాతీయవాద కవి, నైపుణ్యం కలిగిన నిర్వాహకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ."
- ఎం వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చూడండి: 'కరోనాపై భయాన్ని తొలగించి.. అవగాహన కల్పించండి'