ETV Bharat / bharat

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్​

author img

By

Published : Apr 19, 2020, 10:15 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లో కరోనా నుంచి కోలుకుని క్వారంటైన్​లో ఉన్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్​గా తేలింది. డిశ్చార్జి అయిన తర్వాత మళ్లీ కరోనా లక్షణాలు రావటం వల్ల వైద్యులను సంప్రదించగా ఈ విషయం బయటకు వచ్చింది.

HP-VIRUS-RECUR
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్​

హిమాచల్​ ప్రదేశ్​లో కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీ జమాత్​ సభ్యుడికి మళ్లీ వైరస్ పాజిటివ్​గా తేలింది. రెండు సార్లు పరీక్షించిన తర్వాత కరోనా నెగటివ్​గా రావటం వల్ల గత వారంలో డిశ్చార్జి అయ్యాడు ఈ వ్యక్తి.

అతనిలో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించటం వల్ల వైద్యులను సంప్రదించాడు. నిర్ధరణ పరీక్షలు చేయగా వైరస్ పాజిటివ్​గా తేలింది.

జమాత్ సభ్యుడే..

మండీ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు జమాత్​ సభ్యులు నక్రోహ్ గ్రామంలోని మసీదులో ఉంటున్నారు. వీరికి ఏప్రిల్​ 2న కరోనా పాజిటివ్​గా తేలటం వల్ల కాంగ్​డా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు అధికారులు.

నిబంధనల ప్రకారం వీరికి ఏప్రిల్​ 10న పరీక్షలు చేయగా నెగటివ్​గా వచ్చింది. ఏప్రిల్ 12న మరోసారి చేయగా అదే ఫలితం పునరావృతం అయింది. ఈ కారణంగా వీరి ముగ్గరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి క్వారంటైన్​లో పెట్టారు.

వీరిలో ఒకరికి మళ్లీ పాజిటివ్​గా రాగా.. హిమాచల్​ ప్రదేశ్​లో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది.

ఇదీ చూడండి: దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్‌ ప్రభావం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.