ETV Bharat / bharat

'సగానికిపైగా కొవిడ్​ మరణాలు 60 ఏళ్ల పైబడినవారిలోనే'

author img

By

Published : Aug 4, 2020, 5:44 PM IST

దేశంలో కరోనా యాక్టివ్​ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తొలి లాక్​డౌన్​ తర్వాత మొదటిసారిగా వైరస్​ మరణాల రేటు అత్యల్పంగా నమోదైందని పేర్కొంది. మరణాల్లోనూ సగానికిపైగా 60 ఏళ్లపైబడిన వారే ఉన్నారని వెల్లడించారు ఆరోగ్య శాఖ కార్యదర్శి.

Recovered COVID-19 cases now double of active cases: Health Ministry
'సగానికిపైగా కొవిడ్​ మరణాలు 60 ఏళ్ల పైబడినవారిలోనే'

కరోనా మరణాల రేటులో తగ్గుదల కనిపిస్తోందని.. దేశంలో మొదటి లాక్​డౌన్​ తర్వాత తొలిసారి అత్యల్పంగా 2.10 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్​ కేసుల కంటే వైరస్​ను జయించినవారి సంఖ్య కూడా రెట్టింపు అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్​​ భూషణ్​ వెల్లడించారు.

ఆర్​టీ-పీసీఆర్​, రాపిడ్​ యాంటీజెన్​ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలు వేగం పుంజుకున్నాయని రాజేష్ తెలిపారు. ఫలితంగా ప్రతీ 10 లక్షల జనాభాలో రోజుకు 140 మందికి పరీక్షలు జరుగుతున్నాయని.. వీటిల్లో గోవా, దిల్లీ, త్రిపుర, తమిళనాడు ముందంజలో ఉన్నాయన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..

  • భారత్​లో పాజిటివిటీ​ రేటు 8.89 శాతంగా ఉంది.
  • పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా, అసోం, పశ్చిమ్​ బంగా​, కర్ణాటక రాష్ట్రాల్లో 10 శాతం కన్నా తక్కువే ఉంది.
  • గడచిన 24 గంటల్లో 6.6 లక్షల మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఫలితంగా దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా కొవిడ్​ టెస్టులు పూర్తయ్యాయి.
  • మొదటి లాక్​డౌన్​ తర్వాత తొలిసారిగా వైరస్​ మరణాల రేటు అత్యల్పంగా 2.10 శాతానికి చేరింది.
  • దేశంలో ప్రస్తుతం 5,86,298 యాక్టివ్ కేసులున్నాయి. 12లక్షల మందికిపైగా కొవిడ్​​ నుంచి కోలుకున్నారు.
  • కరోనా వల్ల మరణించిన వారిలో 50 శాతం మందికిపైగా 60ఏళ్లు పైబడిన వారు. 37 శాతం మంది 45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు వారు.

ఇదీ చూడండి: 'ఆ మరణాల లెక్కలు చెబితేనే కరోనా ప్రభావంపై స్పష్టత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.