కర్ణాటక గత ప్రభుత్వంపై అసమ్మతితో రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలు నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం తర్వాతే తిరిగి బెంగళూరుకు చేరుకోనున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణం కూలిపోవడంపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారని సమాచారం. అసమ్మతి ఎమ్మెల్యేలు ఏం కోరుకున్నారో అదే జరిగిందని కర్ణాటకకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేసి రాజీనామాలు చేసినప్పుడు తమ వెనక భాజపా లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
'4 వారాల సమయమివ్వండి'
కాంగ్రెస్-జేడీఎస్ కూటమిపై అసమ్మతితో రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలు తన ఎదుట హాజరు కావాలన్న స్పీకర్ ఆదేశాలపై ఆయా శాసన సభ్యులు 4 వారాల గడువు కోరారు. వారి తరఫు న్యాయవాది ద్వారా ఈ సమయాన్ని కోరినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:'అక్రమ మార్గంలో అధికారంలోకి భాజపా'