ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడినంత మాత్రాన విపక్షాలు జాతివ్యతిరేకులు కారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వివాదాస్పద పౌర చట్టాన్ని వెనక్కి తీసుకుంటే సీఏఏపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
సీఏఏకు వ్యతిరేకంగా పెయింటింగ్స్‌తో నిరసన తెలుపుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత.. బంగాల్‌లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను అమలు చేసేది లేదని పునరుద్ఘాటించారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్‌ల తర్వాత... సీఏఏ అమలును నిరాకరిస్తూ ఓ తీర్మానాన్ని బంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్ఆర్సీ వ్యతిరేక తీర్మానానికి సైతం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి : నిర్భయ దోషి పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు