ETV Bharat / bharat

దేశంలోనే ఏకైక 'బ్లాక్‌శాండ్‌' బీచ్‌.. ప్రత్యేకతలు ఇవే

రోజువారీ జీవితం నుంచి కాస్త సేదతీరాలంటే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది బీచ్‌లే. అలాంటి సాగరతీరం ప్రస్తావన మనసులో మెదలగానే.. నీలి సముద్రం, అలలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఇసుక బీచ్‌లు కళ్లముందు కదలాడుతాయి. సాధారణంగా సాగరతీరాలు తెల్లని, లేదంటే ఎరుపురంగు ఇసుకతో ఉంటాయి. కానీ, కర్ణాటకలోని ఓ బీచ్‌ విభిన్నంగా సందడి చేస్తోంది. భారత్‌లో ఈ తరహా బీచ్‌ ఒక్కటే ఉందండోయ్‌. ఇంతకీ ఏంటి దీని ప్రత్యేకత ?

Rare Black Sand Beach of Karwar
దేశంలోనే ఏకైక 'బ్లాక్‌శాండ్‌' బీచ్‌.. ఏంటి ప్రత్యేకతలు ?
author img

By

Published : Nov 15, 2020, 7:32 AM IST

దేశంలోనే ఏకైక 'బ్లాక్‌శాండ్‌' బీచ్‌.. తిల్మటి

ఏన్నో ప్రకృతి అందాలతో అలరారే కర్ణాటకలో మరో ప్రత్యేక ఆకర్షణ అబ్బురపరుస్తోంది. ఉల్లాసం కోసం బీచ్‌లవైపు వెళ్లేవారిలో మరింత ఉత్సాహం నింపుతోంది. అదే.. బ్లాక్‌శాండ్‌ బీచ్‌. నల్లని సాగర తీరంతో చూపుతిప్పుకోనివ్వట్లేదు. ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్‌ ప్రాంతంలో ఉంది 'తిల్మటి' సాగరతీరం. ఈ మనోహరమైన బీచ్‌ అందాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

"తిల్మటి బీచ్‌లో నల్లటి ఇసుక ఉంటుంది. దేశంలో నల్లటి ఇసుకతో కనువిందుచేసే సాగరతీరం ఇదొక్కటే."

-నితీశ్‌ నాయక్‌, పర్యటకుడు

తిల్మటి బీచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. ఈ సాగరతీరానికి ఎడమవైపు మజాలి తీరప్రాంతం ఉంటుంది. కుడివైపు గోవా సరిహద్దులోని పోలెం బీచ్‌ ఉంటుంది. ఇవి రెండూ సాధారణ ఇసుకతోనే ఉంటాయి. వాటి మధ్యలో నల్లటి ఇసుక తీరంతో అచ్చెరువొందిస్తుంది తిల్మటి. ఈ నల్లరంగుకు కారణాలు ఇప్పటికే మిస్టరీనే..

"ఈ బ్లాక్‌శాండ్‌ బీచ్‌ అద్భుతంగా ఉంది. పర్యాటకులకు ఇది చాలామంది ప్రదేశం. చాలామంది ఔత్సాహికులు ఇక్కడకు వచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తారు."

-నితీశ్‌ నాయక్‌, పర్యటకుడు

ఈ బీచ్‌లో అలలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. నల్లటి రాళ్లు, కొండల మధ్య కెరటాలు సందడి చేస్తాయి. ఈ బీచ్‌కు స్థానికులు కొంకణి భాషలో 'తిల్మటి' పేరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు.

బీచ్‌ చుట్టూ విస్తరించిన నల్లటి కొండల వల్లే ఈ సాగరతీరానికి నలుపురంగు వచ్చిందని అంటున్నారు నిపుణులు. మొత్తంగా ఈ బీచ్‌లో సూర్యాస్తమయం చూడటం అద్భుత అనుభూతి అంటున్నారు పర్యటకులు. ఇక్కడికి చేరుకోవటానికి పడిన ప్రయాసలను ఈ బీచ్‌ మర్చిపోయేలా చేస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.