ETV Bharat / bharat

'యూపీలో రామ రాజ్యం కాదు.. ఆటవిక రాజ్యమే' - రామ రాజ్యం కాదు ఆటవిక రాజ్యమే

అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన జరిగినప్పటికీ.. యూపీలో ఆటవిక పాలన కొనసాగుతూనే ఉందని శివసేన వ్యాఖ్యానించింది. యూపీలో మహిళలపై ఇటీవల జరిగిన అకృత్యాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కదిలించలేకపోయాయని మండిపడింది. దేశం మునుపెన్నడూ ఇంతటి నిస్సహాయ స్థితిలో లేదని వ్యాఖ్యానించింది.

Ram temple foundation laid, but jungle raj reigns in UP: Sena
'యూపీలో రామ రాజ్యం కాదు.. ఆటవిక రాజ్యమే'
author img

By

Published : Oct 3, 2020, 2:09 PM IST

హాథ్రస్ అత్యాచార ఘటన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై శివసేన మండిపడింది. అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని విమర్శించింది. ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలపై ఇటీవల జరిగిన అకృత్యాలు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కదిలించలేక పోయాయని దుయ్యబట్టింది. ఈ మేరకు పార్టీ అధికారి పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో నిప్పులు కురిపించింది.

"అయోధ్యలో రామ మందిరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కానీ యూపీలో రామ రాజ్యం లేదు. శాంతి భద్రతల విషయంలో ఆటవిక రాజ్యం ఉంది. మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. యువతులపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి."

- సామ్నా సంపాదకీయం

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హాథ్రస్ ఘటనలో బాధితురాలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మరణ వాంగ్మూలంలో పేర్కొన్న విషయాన్ని శివసేన ప్రస్తావించింది. కానీ ప్రభుత్వం మాత్రం యువతి అత్యాచారానికి గురికాలేదని చెబుతోందని మండిపడింది. అదే సమయంలో బలరాంపుర్​లో మరో సామూహిక అత్యాచారం జరిగిందని వివరించింది.

"ఇన్ని ఘటనలు జరిగినా యోగి ప్రభుత్వం, కేంద్రం స్పందించలేదు. అసలు అత్యాచారమే జరగలేదని, అలాంటప్పుడు విపక్షాలు ఎందుకు గొంతుచించుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అత్యాచారం జరగకపోతే బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారు? పెట్రోల్ పోసి బాధితురాలిని తగలబెట్టారు. ఏ హిందూ సంప్రదాయంలో ఇలాంటి అమానవీయ చర్య జరుగుతుంది?"

-సామ్నా సంపాదకీయం

హాథ్రస్ పర్యటనకు వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీతో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది శివసేన. ఓ ప్రధాన పార్టీ నేత పట్ల అవమానకరంగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పాల్ఘర్​లో ఇద్దరు సాధువులపై మూక దాడిని ప్రస్తావించింది. 'మూకదాడి జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్, భాజపా హిందుత్వ ప్రకటనలు చేశారు. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నార'ని ప్రశ్నించింది.

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యపై జరిగిన టీవీ డిబేట్​లలో పాల్గొనేందుకు పట్టణాలవైపు పరుగులు పెట్టిన భాజపా ప్రతినిధులే హాథ్రస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదని చెబుతున్నారని శివసేన పేర్కొంది. బాధితురాలి మరణ వాంగ్మూలానికి విలువ లేదా అని ప్రశ్నించింది. దేశం మునుపెన్నడూ ఇంత నిస్సహాయ స్థితిలో లేదని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి- హాథ్రస్​లోకి మీడియాకు అనుమతి- రాజకీయ నేతలకు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.