పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలిరోజు భేటీ అయింది. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు.
అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవలి కాలంలో మరణించిన ముగ్గురు సిట్టింగ్ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.