ETV Bharat / bharat

రాజకీయ రంగ ప్రవేశంపై నేడు రజనీ కీలక ప్రకటన! - రాజకీయ రంగ ప్రవేశం

సూపర్​ స్టార్​ రజనీకాంత్​ తన అభిమాన సంఘాల నాయకులతో నేడు సమావేశం కానున్నారు. వారితో చర్చించిన అనంతరం ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో నేటి సమావేశంపై తమిళనాట ఆసక్తి నెలకొంది.

Rajinikanth
సూపర్​ స్టార్​ రజనీకాంత్​
author img

By

Published : Nov 30, 2020, 5:26 AM IST

సూపర్​ స్టార్ రజనీ కాంత్ తన అభిమాన సంఘం జిల్లా కార్యదర్శులతో నేడు సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ జరగనున్నట్లు 'రజనీ మక్కల్​ మంద్రమ్' వర్గాలు ధ్రువీకరించాయి. దాదాపు 50 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారిలో ఒకరైన తుగ్లక్​ పత్రిక సంపాదకులు గురుమూర్తితో వారం కిందట అమిత్​ షా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు చకచకా మారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న తమిళ భాజపా నాయకులు కూడా రజనీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్​స్టార్​ మద్దుతు కూడగట్టే దిశగా అమిత్​ షాకు సూచనలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట భాజపా జెండా పాతాలని చూస్తోంది.

కొద్దిరోజుల కిందట రజనీ కాంత్​ రాజకీయ రంగ ప్రవేశం, ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన విడుదల అయ్యింది. ఆ లేఖపై స్వయంగా సూపర్​ స్టార్​ ప్రతినిధులు వివరణ ఇచ్చుకున్నారు. ఏదేమైనా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రజనీ ప్రకటించబోయే నిర్ణయం కీలకంకానుంది.

ఇదీ చూడండి:'చెన్నై వలంటీర్​ నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.