ETV Bharat / bharat

మీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి: రజనీ

సూపర్​ స్టార్​ రాజకీయ రంగ ప్రవేశంపై నిరాశ చెందిన అభిమాన సంఘం నేతలు వేరే పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రజనీ మక్కల్​ మండ్రం ఓ కీలక ప్రకటన చేసింది. అభిమానులు వారి ఇష్టాలకు అనుగుణంగా ఏ పార్టీలో అయినా చేరవచ్చని తెలిపింది.

Rajini Makkal Manram cadres free to join any political party
మీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి:రజనీ
author img

By

Published : Jan 18, 2021, 7:28 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పినందున... ఆయన అభిమాన సంఘం నేతలు వారికి ఇష్టం వచ్చిన పార్టీలో చేరవచ్చని రజనీ మక్కల్​ మండ్రం(ఆర్​ఎంఎం) తెలిపింది. వేరే పార్టీతో కలిసి పనిచేసినా వారు ఎప్పటికీ తలైవా అభిమానులుగానే ఉంటారని పేర్కొంది. ఈమేరకు ఆర్​ఎంఎం నాయకుడు వి.ఎం సుధాకర్​ ఓ ప్రకటన విడుదల చేశారు.

Rajini Makkal Manram cadres free to join any political party
రజనీ మక్కల్​ మండ్రం విడుదల చేసిన ప్రకటన

రాజకీయం రంగ ప్రవేశంపై సూపర్​ స్టార్​ వెనక్కి తగ్గడంపై నిరాశ చెందిన ముగ్గురు ఆర్​ఎంఎం జిల్లా కార్యదర్శలు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమాన సంఘం చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో 234 సీట్లలోనూ పోటీ చేస్తామని రజనీ తొలుత ప్రకటించారు. అయితే అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవలే స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రజనీ రాజకీయ నిర్ణయంపై అభిమానుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.