అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రాజస్థాన్ ప్రభుత్వం గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు మరోసారి ప్రతిపాదనలు పంపింది. జులై 31 నుంచే సమావేశాలు ప్రారంభించాలని కోరింది. నిజానికి ఇంతకు ముందే గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపగా.. అందులో కొన్ని అంశాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తం చేశారు. తాజా కేబినెట్ సమావేశంలో వాటిని సవరించారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సవరణలతో కూడిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం వాటిని గవర్నర్‌కు సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
గవర్నర్ లేవనెత్తిన సందేహాలు ఇవే..
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తాను సిద్ధమేనని, ఈ విషయంలో ఎలాంటి ఇతర ఉద్దేశాలూ లేవని ఇటవల పేర్కొన్నారు గవర్నర్ కల్రాజ్ మిశ్రా. అయితే మూడు షరతులు అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ముందు ఉంచారు.
సమావేశాల నిర్వహణకు 21 రోజుల ముందు నోటీసుకు అంగీకరిస్తే సమావేశాల నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ మెలిక పెట్టారు. కరోనా సంక్షోభం వేళ తక్కువ సమయంలో ఎమ్మెల్యేలను సమావేశాలకు హాజరవ్వాలని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. అలాగే సమావేశాల్లో భౌతిక దూరం ఎలా అని ప్రశ్నించారు.
మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనుకుంటే దానికి ప్రత్యక్ష ప్రసారం నిర్వహించాల్సి ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. అయినా, కేబినెట్ పంపిన ప్రతిపాదనలో అది లేదన్నారు. మీడియాలో మాత్రం సీఎం బల నిరూపణ గురించి మాట్లాడతున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ అశోక్ గహ్లోత్ మంత్రివర్గం ఇదివరకే రెండు సార్లు పంపిన సిఫార్సులను గవర్నర్‌ను తిప్పి పంపారు. తొలి సిఫార్సులు పంపించడం రెండోసారి ప్రతిపాదనల్లో బలనిరూపణ అనే ప్రస్తావన లేకుండా కేవలం కరోనా, ఇతర అంశాలపై చర్చించేందుకే అని గహ్లోత్ కేబినెట్ పేర్కొంది.
ఇదీ చూడండి:కాంగ్రెస్‌పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!