ETV Bharat / bharat

రాజకీయ​ సంక్షోభం వేళ నేడు రాజస్థాన్​ సీఎల్​పీ భేటీ!

నేడు రాజస్థాన్​ కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Raj Congress calls legislature party meeting on Tuesday
రాజకీయ​ సంక్షోభం వేళ నేడు రాజస్థాన్​ సీఎల్​పీ భేటీ!
author img

By

Published : Jul 21, 2020, 5:06 AM IST

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో.. నేడు మరోమారు శాసనసభా పక్ష సమావేశానికి కాంగ్రెస్​ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. జైపుర్​ శివారులో.. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​కు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలు బసచేస్తున్న హోటల్​లో ఈ సమావేశం జరగనుందని సమాచారం. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయన్న దానిపై అస్పష్టత నెలకొంది.

వారం రోజుల వ్యవధిలో సీఎల్​పీ సమావేశం జరగడం ఇది మూడోసారి.

ఇదీ చూడండి:- 'ఆడియో టేప్​'పై కేంద్ర మంత్రికి నోటీసులు

పైలట్​ తిరుగుబాటుతో...

గత కొంత కాలంగా కాంగ్రెస్​పై అసంతృప్తితో ఉన్న యువనేత సచిన్​ పైలట్​.. రెబల్​గా మారారు. దీంతో రాజస్థాన్​ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అనంతరం గత వారం జరిగిన సీఎల్​పీ సమావేశంలో పైలట్​పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్​. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై స్పందించిన పైలట్​.. నిజాన్ని వక్రీకరించగలరు కానీ, ఓడించలేరని పేర్కొన్నారు. తాను భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.