ETV Bharat / bharat

దిల్లీలో భారీ వర్షాలు.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు - భారత వాతావరణ శాఖ

దేశ రాజధాని దిల్లీని వరుణుడు వణికిస్తున్నాడు. గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు కురవడం వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజుల వరకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.

Rains lash parts of Delhi, more predicted
దిల్లీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
author img

By

Published : Jul 26, 2020, 4:46 PM IST

దిల్లీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనితో అనేక ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. అయితే ఇకపై మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తోంది భారత వాతావరణశాఖ (ఐఎండీ).

మధ్య దిల్లీ, ఈశాన్య దిల్లీ, షాహధారా, ముండకా, రోహిణి, బవానా పరిసర ప్రాంతాల్లో ఉరుములతో, ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి.

మరోవైపు దిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్​సీఆర్​)లో సోమవారం వరకు చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే వాయువ్య భారతంలో మంగళ, బుధవారాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: వీడియో: కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.