ETV Bharat / bharat

బిజినెస్​ స్కూళ్లలో పాఠ్యాంశంగా బయోటాయిలెట్లు - పాఠ్యాంశంగా రైల్వే బయె టాయిలెట్లు

రైల్వేలో బయోటాయిలెట్ల ప్రక్రియ విజయవంతం కావడం వల్ల.. బిజినెస్​ స్కూళ్లలో వాటిని పాఠ్యాశంగా ప్రవేశపెట్టనున్నారు అధికారులు. పర్యావరణహితం, పరిశుభ్రతకు కారణమైన ఈ అంశాన్ని ఇండియన్​ బిజినెస్​ స్కూల్​ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చేందుకు రైల్వేశాఖ అనుమతించింది.

Railways use of bio-toilets: Lessons in innovation, sustainability now part of B-school classrooms
బిజినెస్​ స్కూళ్లలో పాఠ్యాంశంగా రైల్వే బయోటాయిలెట్లు
author img

By

Published : Nov 23, 2020, 6:48 AM IST

రైళ్లలో వినియోగిస్తున్న బయోటాయిలెట్ల అంశం బిజినెస్​ స్కూళ్లలో పాఠ్యాంశం కాబోతోంది. వాటి ఆవిష్కరణ, పర్యావరణహిత ప్రయోజనాలను మేనేజ్​మెంట్​ విద్యార్థులకు బోధించనున్నారు. ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​(ఐఎస్​బీ) దీనిపై చేసిన అధ్యయనాన్ని పాఠ్యాంశంగా బోధించేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది.

డీఆర్​డీఓ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో రైళ్లలో ఈ టాయిలెట్ల ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. అయితే.. వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు సుస్థిరాభివృద్ధిలో ఇది ఒక పాఠంగా నిలుస్తోందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. 2011లో గ్వాలియర్​లో నమూనాగా వీటి వినియోగాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది నాటికి 68,694 కోచ్​లలో 2.45లక్షల బోగీల్లో బయోటాయిలెట్లను ఏర్పాటుచేశారు. వీటివల్ల.. పర్యావరణ హితం; పరిశుభ్రమైన స్టేషన్లు, రైళ్లు వంటి రెండు ప్రయోజనాలు చేకూరాయని రైల్వే అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి: ఉద్యోగం కోసం.. నాన్నను చంపి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.