ETV Bharat / bharat

చైనా కంపెనీతో  రైల్వే కాంట్రాక్ట్ రద్దు!

ఓ చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్​ను రద్దు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కాన్పుర్- మొగల్​ సరాయి మధ్య నిర్మిస్తున్న రైల్వే లైనులో.. సిగ్నలింగ్, టెలికమ్యునికేషన్​ పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం చేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

Railways to terminate Chinese company's contract due to 'poor progress'
చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసిన భారతీయ రైల్వే
author img

By

Published : Jun 18, 2020, 4:18 PM IST

భారతీయ రైల్వే ఓ చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్​ను తాజాగా రద్దు చేయాలని నిర్ణయించింది. కాన్పుర్​-మొగల్​ సరాయి మధ్య నిర్మిస్తున్న ఈస్టర్న్​ డెడికేటెడ్​ ఫ్రైట్ కారిడార్​లో 417 కి.మీ. విభాగంలో ... సిగ్నలింగ్, టెలికమ్యునికేషన్​ పనుల్లో సరైన పురోగతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యునికేషన్​ గ్రూప్​నకు 2016లో రూ.471 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చింది భారతీయ రైల్వే. ఈ ఒప్పందం ప్రకారం, 2019 లోపు సిగ్నలింగ్​, టెలికమ్యునికేషన్ పనులు పూర్తిచేయాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 20 శాతం పనిని మాత్రమే ఆ కంపెనీ పూర్తి చేయగలిగింది. దీనితో కాంట్రాక్ట్ రద్దు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

ఇదీ చూడండి: 'చైనా హొటళ్లు, రెస్టారెంట్లను నిషేధించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.