ETV Bharat / bharat

కళ్లు, చెవులు పనిచేయట్లేదేమో: రాహుల్ - మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

నరేంద్ర మోదీ సర్కార్​పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల జోరు పెంచారు. ఆశా కార్యకర్తలు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్రంపై మండిపడ్డారు.

Rahul
రాహుల్
author img

By

Published : Aug 8, 2020, 12:26 PM IST

ఆశా కార్యకర్తలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటికే మోదీ ప్రభుత్వం మూగబోయిందని.. ప్రస్తుతం కళ్లు, చెవులు కూడా పనిచేయట్లేదేమోనని ఎద్దేవా చేశారు.

Rahul
రాహుల్ ట్వీట్

"దేశ వ్యాప్తంగా ఇంటి ఆరోగ్య సంరక్షణకు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వాళ్లు నిజంగా ఆరోగ్య యోధులు. కానీ, ఈ రోజు వాళ్ల హక్కులను కాపాడుకునేందుకు సమ్మెకు దిగాల్సివచ్చింది.

ప్రభుత్వం ఇప్పటికే మూగబోయింది. కానీ, ఇప్పుడు అంధత్వం, చెవుడుతో బాధపడుతున్నట్టు ఉంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

మెరుగైన సేవల పరిస్థితులు, ప్రయోజనాలు కోసం రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీ, జాతీయ ఆరోగ్య మిషన్​ పిలుపునిచ్చాయి.

ఇదీ చూడండి: తల్లి పాలు దానం చేస్తే ఎంతో మేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.