మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ అగ్రనేత హెచ్.డి.దేవేగౌడతో భేటీ అయ్యారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కర్ణాటకలో లోక్‌సభ సీట్ల పంపకం, సర్దుబాట్లపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
10 సీట్లు అడిగాం...
"కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 10స్థానాలను మా పార్టీకి కేటాయించాలని అడిగాం. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, మా పార్టీ నాయకుడు డానిష్ అలీలతో రాహుల్ గాంధీ చర్చించాక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. " -- దేవేగౌడ, జేడీఎస్ అగ్రనేత
ఆ ప్రాంతం ప్రత్యేకం
దక్షిణ కర్ణాటక పాత మైసూరు ప్రాంతంలోని లోక్‌సభ సీట్లపైనే కాంగ్రెస్, జేడీఎస్ ప్రధానంగా సమాలోచనలో పడ్డాయి. ఆ ప్రాంతంలోని మాండ్య, హాసన్ లోక్‌సభ స్థానాలను జేడీఎస్‌కు కేటాయించేందుకు సుముఖంగా ఉంది కాంగ్రెస్.
కాంగ్రెస్‌తోనే ముందుకు..
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే వాదనలు ఎన్నో వస్తున్నాయి. అయినా జేడీఎస్ అగ్రనాయకత్వం వాటిని కొట్టేస్తూ వస్తోంది. కాంగ్రెస్‌తోనే ముందుకు సాగుతామని స్పష్టంగా చెబుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీతోనే పొత్తు ఉంటుందని ఇటీవలే వ్యాఖ్యానించారు ఆ పార్టీ అగ్రనేత దేవేగౌడ. ఈ మేరకు నేడు ఇరువురు నేతలు భేటీ కావడం వల్ల పొత్తు తథ్యమనే సంకేతాలను పంపారు.