తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జనవరి 23న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వెల్లడించారు. ఈ ఎన్నికల్లోనూ డీఎంకేతో పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కమల్ హాసన్ తమతో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.
"జనవరి 23న కోయంబత్తూర్, త్రిస్సూర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈరోడ్‌లో జరిగే సభకు హాజరయ్యేందుకు కూడా ఆయన అంగీకరించారు"
-- కేఎస్ అళగిరి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు
ఎన్నికల్లో తమదే విజయమని అళగిరి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేస్తామని చెప్పారు. విద్య, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. విధానాల పరంగా డీఎంకేతో కొన్ని అంతరాలు ఉన్నప్పటికీ.. లౌకికవాదానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.
ఈ నెల 14న మధురైలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు తమిళనాడుకు రాహల్ వచ్చారు.
ఏప్రిల్-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:'కమలం' విరిసింది.. తులసేంద్రపురం మురిసింది!