'న్యాయ్' ఎంతో విప్లవాత్మక పథకమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. 5 కోట్ల మంది పేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఆర్థికాభివృద్ధి తిరోగమించిందని విమర్శించారు రాహుల్. తమిళనాడును మోదీ నియంత్రించాలని చూస్తున్నట్లు రాహుల్ ఆరోపించారు.
"తమిళనాడు ముఖ్యమంత్రిని నియంత్రించగలనని మోదీ అనుకుంటున్నారు. వాళ్లు(భాజపా) తమిళనాడు చరిత్ర చదవలేదు. వాళ్లకు తమిళ రచయతలు, ప్రముఖుల చెప్పిన సూత్రాలు తెలియవు. పెరియార్, కరుణానిధి ఏం చెప్పారో తెలియదు. వాళ్లకు తమిళ స్ఫూర్తి అసలే తెలియదు. తమిళనాడు భవిష్యత్తును మీరే నిర్ణయించాలి. రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేస్తాం. మేనిఫెస్టోలో ఇదొక చిన్న వ్యాక్యం మాత్రమే కాదు తమిళుల ఆకాంక్ష"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
వైద్యవిద్య కోర్సు ఎంపికలో దేశవ్యాప్తంగా ఒకే పోటీ పరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఒకే సారి నీట్ అమలు చేస్తే విద్యార్థులు నష్టపోతారని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు మినహాయింపు కల్పించింది కేంద్రం.
వైద్యవిద్యకు దేశవ్యాప్తంగా ఒకే పోటీ పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 2016 నుంచి అన్ని రాష్ట్రాల్లో నీట్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడులో మాత్రం 2017 నుంచి అమలు చేశారు. 2017లో అనిత అనే విద్యార్థిని ఆత్మహత్యతో తమిళనాడులో నీట్‌పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. యువతతో సహ తమిళనాడు యావత్తు నీట్‌ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్, ఆప్ మధ్య కుదరని పొత్తు