పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఇవాళ ఆందోళన చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో తనతో కలిసి పాల్గొనాలంటూ విద్యార్థులు, యువతకు పిలుపిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
"ప్రియమైన ఈ దేశ విద్యార్థులు, యువతకు..
మన భవిష్యత్తును మోదీ, షా నాశనం చేశారు. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చారు. అందుకే భారత్‌ను విడగొట్టి ద్వేషాన్ని నింపుతున్నారు. వాళ్లను ఓడించాలంటే ప్రతి భారతీయుడికీ ప్రేమను పంచాలి.
దేశానికి విద్యార్థులే భవిష్యత్తు. మీరే మోదీ, షాలను అడ్డుకోవాలి. కలిసి వారు పంచుతున్న ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడుదాం. మనం భారతీయులమని చెప్పుకుంటే సరిపోదు. ఆ విషయాన్ని చాటిచెపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌ఘాట్‌లో మాతో కలవండి. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా నిరసన తెలుపుదాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాజ్‌ఘాట్‌కు తరలిరావాలని దేశ ప్రజలకు పిలుపిచ్చారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఈ ఆందోళనలో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: జన స్థిరీకరణకు మేలిమి వ్యూహం