రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్పై తీర్పును దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. బుధవారం విచారణ చేపట్టిన అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తీర్పును జూన్ 7కు వాయిదా వేశారు.
"సైనికులు రక్తం చిందిస్తే... ప్రధాని మోదీ వారి త్యాగాలను భాజపా కోసం సొమ్ము చేసుకుంటున్నారు" అని 2016లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులకు ఆదేశివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది జోగిందర్ తులి.
ఈ విషయంపై దిల్లీ పోలీసులు ఈ నెల 15న కోర్టుకు నివేదిక అందించారు. ప్రధానిపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, కేసు నమోదు చేస్తామని నివేదికలో పేర్కొన్నారు పోలీసులు.
ఇదీ చూడండి: విపక్షాలకు షాక్... ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క