ETV Bharat / bharat

భారత్​ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం - irani

పేదరికం, నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధి.... ఎన్నికలకు ఇవే కీలకాంశాలు కావాలి. ఈసారి మాత్రం వాటిపై చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. కొద్దిరోజులుగా విమర్శలు, ప్రతివిమర్శలన్నీ... "గౌరవం"పైనే. ప్రధానికో, మరో ప్రముఖుడికో గౌరవం ఇవ్వనందుకు కాదు. ఓ ఉగ్రవాదిని 'జీ' అని సంబోధించినందుకు.

భారత్​ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం
author img

By

Published : Mar 20, 2019, 6:28 PM IST

భారత్​ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం
"మీరు గుర్తుకు తెచ్చుకోండి. 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుంటున్న వారి ప్రభుత్వానికి ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుడిగా ఉన్న అజిత్​ డోభాల్.​.. మసూద్​ అజార్​ 'గారి'ని విమానంలో కాందహార్​లో దించి వచ్చారు." - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఈ నెల 11న దిల్లీలో జరిగిన కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యలు ఇవి. కాందహార్​ విమానం హైజాక్​ సమయంలో.... అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం జైషే మహ్మద్ అధినేత మసూద్​ అజార్​ను విడిచిపెట్టిందని విమర్శించడం ఆయన ఉద్దేశం.

దిల్లీ సభలో మరెన్నో ఆరోపణలు చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు. రఫేల్​ వ్యవహారం, నిరుద్యోగంపై అధికార పక్షాన్ని తప్పుబట్టారు. అవేవీ ఎవరికీ గుర్తులేవు. మసూద్​ అజార్​ను ఉద్దేశించి రాహుల్​ అన్న మాటలే చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల వేళ పెను రాజకీయ దుమారం రేపాయి.

రాహుల్​ మాటల్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంది భాజపా. #RahulLovesTerrorists పేరిట ఆన్​లైన్​లో ప్రచారోద్యమం మొదలుపెట్టింది.

" రాహుల్​గారు! అప్పట్లో దిగ్విజయ్​ సింగ్​ 'ఒసామాగారు, హఫీజ్​ సయీద్​ సాబ్​' అని అన్నారు. ఇప్పుడు మీరు 'మసూద్​ అజార్ ​జీ' అంటున్నారు. కాంగ్రెస్​ పార్టీలో ఏం జరుగుతోంది?"
-రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర మంత్రి

  • Come on “Rahul Gandhi Ji”!

    Earlier it were the likes of Digvijay Ji who called “Osama Ji” and “Hafiz Saeed Sahab”.

    Now you are saying “Masood Azhar Ji”.

    What is happening to Congress Party? pic.twitter.com/fIB4FoOFOh

    — Chowkidar Ravi Shankar Prasad (@rsprasad) March 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.... రాహుల్​ గాంధీకి, పాకిస్థాన్​కు ఉగ్రవాదులంటే ప్రేమ అంటూ ఓ వీడియో పోస్ట్​ చేశారు.

"రాహుల్​ గాంధీకి, పాకిస్థాన్​కు తేడా ఏముంది? వారికి ఉగ్రవాదులంటే ప్రేమ. రాహుల్​ గాంధీ ఉగ్రవాది మసూద్​ అజార్​కు ఇస్తున్న గౌరవాన్ని చూడండి."
-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

కేంద్రమంత్రులే కాదు... భాజపా సీనియర్​ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు మసూద్​ అంశంపై సామాజిక మాధ్యమాల్లో విజృంభించారు. రాహుల్​పై దుమ్మెత్తిపోస్తూ... ట్వీట్ల సునామీ సృష్టించారు.

కాంగ్రెస్​ ఎదురుదాడి

భాజపా డిజిటల్​ సైన్యం దాడితో కాంగ్రెస్​ ఉక్కిరిబిక్కిరైంది. అంతర్జాలం వేదికగానే ఎదురుదాడి ప్రారంభించింది.

"ప్రశ్న-1. ఉగ్రవాది మసూద్​ అజార్​కు​ కాందహార్​లో​ అజిత్​ డోభాల్​ భద్రత కల్పించారా? లేదా?
ప్రశ్న-2. పఠాన్​కోట్​ ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్​ ఐఎస్​ఐ తీవ్రవాదిని తీసుకొచ్చారా? లేదా?"​
-రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

  • 2 questions to BJP & select Bhakt Media,who deliberately seek to twist the ‘Masood’ sarcasm of Rahulji-:

    1 Did NSA Doval not escort & release terrorist Masood Azhar in Kandahar?

    2 Did Modiji not invite Pak's rogue ISI to investigate Pathankot terror attack? #BJPLovesTerrorists pic.twitter.com/nBvjsQi7Mp

    — Randeep Singh Surjewala (@rssurjewala) March 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​.... ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా అధినేత హఫీజ్​ సయీద్​ను ఉద్దేశించి గతంలో అన్న మాటల్ని అస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్​. హఫీజ్​ను 'గారు' అని సంబోధించినట్లుగా ఉన్న ఆ వీడియోను #BJPLovesTerrorists హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేసింది.

  • Hope this finds pride of place in BJP‘s revamped website,as& when it returns. BJP‘s admiration of Hafeez Saeed&his ilk. Also reminds us how they sent their special emissary to Pak,Ved P Vaidik, to have a dialogue with him&hug him. Hugplomacy began from there. #BJPLovesTerrorists pic.twitter.com/A75LHFg1eG

    — Priyanka Chaturvedi (@priyankac19) March 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
కాంగ్రెస్​ విమర్శల్ని తిప్పికొట్టారు రవిశంకర్​. గతేడాది జరిగిన ఓ సమావేశంలో వ్యంగ్యంగా అలా అన్నానని, పూర్తి వీడియో చూస్తే అర్థం అవుతుందని స్పష్టంచేశారు.

"జిన్​పింగ్​ అంటే భయం..."

మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై ఐరాస భద్రతా మండలిలో జరిగిన పరిణామం... కాంగ్రెస్​కు మరో ఆయుధంలా మారింది. అజార్​పై ఆంక్షలు విధించడాన్ని చైనా అడ్డుకున్నా.... మోదీ ఎందుకు ఏమీ చేయలేదని నిలదీశారు రాహుల్​.

"బలహీన మోదీకి చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ అంటే భయం. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా చైనా వ్యవహరించినా మోదీ నోట ఒక్క మాటైనా రాదు.
చైనాతో మోదీ దౌత్యం ఎలా ఉంటుందంటే...
1. గుజరాత్​లో జిన్​పింగ్​తో ఊయల ఊగడం
2. దిల్లీలో జిన్​పింగ్​ను ఆలింగనం చేసుకోవడం
3. చైనాలో జిన్​పింగ్​ ముందు తల వంచడం"
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

  • Weak Modi is scared of Xi. Not a word comes out of his mouth when China acts against India.

    NoMo’s China Diplomacy:

    1. Swing with Xi in Gujarat

    2. Hug Xi in Delhi

    3. Bow to Xi in China https://t.co/7QBjY4e0z3

    — Rahul Gandhi (@RahulGandhi) March 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ఒకే ఒక్క పదంతో రేగిన దుమారం... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఈ వివాదం మున్ముందు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Mountain View, California, United States - Date unknown
1. Various of entrance at Google headquarters
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Barcelona, Spain - 26 February 2018
2. Various of Android phone
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Mountain View, California - Date unknown
3. Road sign at Google headquarters reading (English) "Google, 1625 Charleston Toad B442"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Barcelona - 26 February 2018
4. Various of Android phone
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Mountain View, California - Date unknown
5. Exterior of Google headquarters
STORYLINE:
EU regulators have fined Google 1.49 billion euros (1.68 billion US dollars) for abusing its dominance in online advertising.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.