ETV Bharat / bharat

కాంగ్రెస్​ న్యాయ్​ హామీకి మూలం మోదీ: రాహుల్​ - న్యాయ్​

హరియాణాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్​ భాజపా సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'అందరి ఖాతాల్లో 15 లక్షలు జమ హామీ' నుంచే 'కనీస ఆదాయ హామీ' ఆలోచన వచ్చిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాహుల్
author img

By

Published : Mar 30, 2019, 7:16 AM IST

Updated : Mar 30, 2019, 7:55 AM IST

కాంగ్రెస్​ న్యాయ్​ హామీకి మూలం మోదీ: రాహుల్​
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నరేంద్రమోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శించారు.హరియాణా కర్నాల్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్​.

గత ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన "అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ హామీ" నుంచే 'కనీస ఆదాయ హామీ' పథకం ఆలోచన వచ్చిందని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు.

మోదీ 15 లక్షలని అబద్ధాలు చెప్పారని , కానీ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే నిరుపేదల ఖాతాల్లో సంవత్సరానికి 72 వేలు జమ చేసి తీరుతుందని రాహుల్​ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్​ కనీస ఆదాయ హామీ పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్​ పార్టీ పథకం ప్రకటించగానే ప్రధాని కంగారు పడ్డారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి :ఈసారి రెట్టింపు ఉత్తేజంతో దూసుకెళ్తాం : రాహుల్

ప్రధాని ధనికులను మాత్రమే ఆదుకుంటారని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆయనకు కనపడరని రాహుల్​ ఎద్దేవా చేశారు. ఈ లోక్​సభ ఎన్నికలు భాజపా-ఆర్​ఎస్​ఎస్​, కాంగ్రెస్​ భావజాలాల మధ్య జరిగే పోరుగా రాహుల్​ అభివర్ణించారు.

Viral Advisory
Friday 29th March 2019.
Please note the following addition to SNTV's output on Thursday 7th September 2017.
VIRAL (GOLF): Lee Westwood hit a hole-in-one at the 11th hole at the World Match Play tournament in Austin, Texas on Friday. Already moved. Broadcast only, no internet.
Last Updated : Mar 30, 2019, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.