పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఊరట కలిగింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ వేసిన పరువునష్టం కేసును విచారించిన పట్నా కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాహుల్ గాంధీ... భాజపాపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై ఆ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
"దేశంలోని పేదలు, రైతుల, కార్మికుల పక్షాన పోరాడటానికి నేను కట్టుబడి ఉన్నాను. వారికి సంఘీభావం తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. మోదీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్-భాజపాకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని లక్ష్యంగా చేసుకుని కోర్టు కేసుల్లో ఇరికిస్తున్నారు. అయినా నా పోరాటం మాత్రం ఆగదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విమర్శలపై అభ్యంతరం చెబుతూ బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ పట్నా కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు.
ఇదీ చూడండి: సోమవారమే కుమారస్వామి సర్కార్ పతనం!