నూతన వ్యవసాయ బిల్లులను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్.. మంగళవారం స్వరం పెంచింది. నూతన బిల్లుల సాయంతో ప్రధాని మోదీ తన పెట్టుబడిదారీ మిత్రుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
-
2014- मोदी जी का चुनावी वादा किसानों को स्वामीनाथन कमिशन वाला MSP
— Rahul Gandhi (@RahulGandhi) September 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2015- मोदी सरकार ने कोर्ट में कहा कि उनसे ये न हो पाएगा
2020- काले किसान क़ानून
मोदी जी की नीयत ‘साफ़’
कृषि-विरोधी नया प्रयास
किसानों को करके जड़ से साफ़
पूँजीपति ‘मित्रों’ का ख़ूब विकास।
">2014- मोदी जी का चुनावी वादा किसानों को स्वामीनाथन कमिशन वाला MSP
— Rahul Gandhi (@RahulGandhi) September 22, 2020
2015- मोदी सरकार ने कोर्ट में कहा कि उनसे ये न हो पाएगा
2020- काले किसान क़ानून
मोदी जी की नीयत ‘साफ़’
कृषि-विरोधी नया प्रयास
किसानों को करके जड़ से साफ़
पूँजीपति ‘मित्रों’ का ख़ूब विकास।2014- मोदी जी का चुनावी वादा किसानों को स्वामीनाथन कमिशन वाला MSP
— Rahul Gandhi (@RahulGandhi) September 22, 2020
2015- मोदी सरकार ने कोर्ट में कहा कि उनसे ये न हो पाएगा
2020- काले किसान क़ानून
मोदी जी की नीयत ‘साफ़’
कृषि-विरोधी नया प्रयास
किसानों को करके जड़ से साफ़
पूँजीपति ‘मित्रों’ का ख़ूब विकास।
"2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సూచించిన ఎంఎస్పీని అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. 2015లో అది అమలు చేయలేమని కోర్టుకు చెప్పారు. 2020లో వ్యవసాయ రంగానికి కళంకంగా మారిన నూతన బిల్లులను తెచ్చారు. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
బిల్లుల్లో పొందుపర్చిన కొన్ని అంశాలను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బిల్లులను సమర్థిస్తూ 'వన్ నేషన్-వన్ మార్కెట్' తమ ఉద్దేశం అని కేంద్రం చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
" దేశంలో 85శాతం మంది రైతులు చిన్న, సన్నకారు కమతాలు ఉన్నవారు. వారికి పండిన వరి, గోధుమలు, కందులు ఇలా పలు రకాల కొద్దిపాటి పంటలను అమ్ముకోవడానికి ఒక మార్కెట్ ఎలా సరిపోతుంది. వేల మార్కెట్లు అవసరం అవుతాయి."
-చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
రెండు కోట్లమంది రైతుల సంతకాలు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. బిల్లులను ఆమోదించవద్దని రెండు కోట్ల మంది రైతులు సంతకాలు చేసిన మెమోరండాన్ని రాష్ట్రపతి కోవింద్‌కు అందజేశారు నాయకులు.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భౌతికంగా సమావేశం అయ్యారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్ళులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత ప్రధాన కార్యాలయంలో భౌతిక సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.