ప్రధాని ఆర్భాటంగా ప్రారంభించిన 'నీతి ఆయోగ్' కేవలం ప్రసంగాలకు, తప్పుడు నివేదికల విడుదలకే పనికొచ్చిందని రాహుల్ ఆరోపించారు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసే ప్రణాళికా సంఘంలో ప్రఖ్యాత ఆర్థిక వేత్తలను నియమిస్తామని రాహుల్ తెలిపారు. మొత్తం సిబ్బంది 100 లోపు ఉంటారని స్పష్టం చేశారు.
1950లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది.