ETV Bharat / bharat

'రఫేల్'​ ప్రత్యేకతలతో వాయుసేన మరింత బలోపేతం

మరికొన్ని గంటల్లో రఫేల్​ యుద్ధ విమానాలు భారత్​లోకి ప్రవేశపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అంబాలలో హరియాణా ప్రభుత్వం 144 సెక్షన్​ విధించింది. ఫ్రాన్స్​ నుంచి రఫేల్​ ప్రయాణం ఎలా సాగింది? అసలు భారత దేశానికి రఫేల్​ ఎందుకింత ప్రత్యేకం?

RAFALE JETS TO ARRIVE IN FEW HOURS IN INDIA
'రఫేల్​ ప్రత్యేకతలతో వాయుసేన మరింత బలోపేతం
author img

By

Published : Jul 29, 2020, 10:58 AM IST

అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలు మరికొన్ని గంటల్లో భారత్​లోకి ప్రవేశించనున్నాయి. రఫేల్​ రాక కోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విమానాలు అంబాలాకు రానున్న నేపథ్యంలో హై అలర్ట్​ ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. అంబాలా ఎయిర్​బేస్​ పరిసర ప్రాంతాలలో మంగళవారం నుంచే 144 సెక్షన్​ విధించింది.

ప్రయాణం ఇలా...

భారత వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరేందుకు రఫేల్​ విమానాలు సోమవారమే ప్రయాణం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరం మెరినాక్‌ వైమానికి స్థావరం నుంచి బయలుదేరిన ఐదు జెట్‌లు పది గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని ఆల్‌ ధాఫ్రా వైమానికి స్థావరంలో దిగాయి. అక్కడి నుంచి హరియాణాలోని అంబాలాకు ఈ రోజు మధ్యాహ్నం చేరుకోనున్నాయి. మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్‌ జెట్‌లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోనుండగా.. అందుకోసం ఫ్రాన్స్‌ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:- ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!

ఎంతుకింత ప్రత్యేకం?

చైనాతో సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో వాయుసేనకు రఫేల్​ అందుబాటులోకి రావడం దేశానికి అత్యంత సానుకూల విషయం. ఎన్నో విశిష్టతలున్న ఈ రఫేల్​ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

అసలేంటి ఈ రఫేల్​?

లాంగ్‌ రేంజ్‌ మిటియార్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులు కలిగిన అత్యాధునిక యుద్ధ విమానమే ఈ రఫేల్. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. శత్రువులపై పోరాటంలో రఫేల్​ ఓ గేమ్​ఛేంజర్​గా మారనుందని వాయుసేన ధీమాగా ఉంది.

ఒప్పందం ఎప్పుడు జరిగింది?

వైమానిక దళం అవసరాలు తీర్చడానికి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం.. 2016 సెప్టెంబర్‌లో భారత్ రూ. 60వేల కోట్లతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎన్ని వస్తున్నాయ్​?

తొలి బ్యాచ్​లో భాగంగా 5 యుద్ధ విమానాలు సోమవారం ఫ్రాన్స్​ నుంచి బయలుదేరాయి. ఇవి బుధవారం దేశంలో అడుగుపెడతాయి. ఫలితంగా ఫ్రాన్స్​, ఖతార్​, ఈజిప్ట్​ దేశాల తర్వాత రఫేల్​ యుద్ధవిమానాలు కలిగిన నాలుగో దేశంగా భారత్​ అవతరించనుంది.

మిగిలినవి ఎప్పుడు?

నిజానికి తొలి బ్యాచ్​లో 10 విమానాలను పంపడానికి ఫ్రాన్స్​ సిద్ధపడింది. అయితే శిక్షణ కోసం ఐదు విమానాలను అక్కడే ఉంచింది భారత్​. దీంతో నేడు ఐదు యుద్ధ విమానాలు భారత్​కు రానున్నాయి. మిగిలిన విమానాలు వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.

ఎవరైనా నడపొచ్చా?

రఫేల్​ యుద్ధ విమానాలు నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఓ బ్యాచ్ ఫ్రాన్స్​లో​ శిక్షణ పొందింది. త్వరలోనే మరో బ్యాచ్​ ఫ్రాన్స్​కు వెళ్లనుంది.

విధులు నిర్వహించడానికి సిద్ధమేనా?

రఫేల్​ను అత్యాధునిక పరికరాలతో రూపొందించింది ఫ్రాన్స్​. విమానానికి సంబంధించిన చాలా భాగాలను తయారీ దశలోనే అమర్చింది​. అందువల్ల భారత్​లో అడుగుపెట్టగానే ఉపయోగించడానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. అయితే విమానాలకు వాయుసేన ఇంకొన్ని మార్పులు చేయనుంది.

ఎప్పుడు ఎగరనున్నాయి?

దేశంలోకి అడుగుపెట్టగానే ఉపయోగించే విధంగా యుద్ధ విమానాలు అందుబాటులోకి రావడం భారత్​కు సానుకూల విషయం. అందువల్ల తుది మెరుగులు దిద్దిన అనంతరం.. కొద్ది వారాల్లోనే విధులు నిర్వహించడానికి రఫేల్​ సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.

తుది మెరుగులు ఎలా ఉండనున్నాయి?

దేశీయ సాంకేతికతతో రూపొందించిన 'నావిక్​' నావిగేషన్​ వ్యవస్థను రఫేల్​కు జోడించనున్నారు. ఎమ్​88-4ఈ ఏరో ఇంజిన్​ను కూడా అమర్చనున్నారు. దీని వల్ల ఎత్తైన, ఆక్సిజన్​ తక్కువగా ఉండే లేహ్​ లాంటి ప్రాంతాల్లోనూ పైలట్లు సులభంగా విమానాలను నడపగలరు. దీనితో పాటు ఆధునిక వాతావరణ వ్యవస్థ, దేశీయ 'అస్త్రా' వంటి క్షిపణులను జోడించేందుకు వీలుగా రఫేల్​లో మార్పులు చేయనున్నారు. వీటన్నిటితో పాటు యుద్ధ విమానాలకు మరింత శక్తి, సామర్థ్యాలను చేకూర్చేందుకు ఇప్పటికే హ్యూమర్​ క్షిపణులను ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేసింది రక్షణశాఖ.

ఎక్కడ మోహరించనున్నారు?

తొలి బ్యాచ్​ రఫేల్​ యుద్ధ విమానాలను భారత్​-పాక్​ సరిహద్దుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలోని అంబాలా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. రెండో బ్యాచ్​లో వచ్చే ఎయిర్​క్రాఫ్ట్​లను బంగాల్​లోని హసిమారా స్థావరానికి తరలిస్తారు.

ఇదీ చూడండి:- రఫేల్​ రాకతో.. గగనతలంలో సవాళ్లకు భారత్​ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.