ETV Bharat / bharat

ఆ ఊర్లోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు మహిళలవే! - women

పంజాబ్​ బటిండా జిల్లాలోని హిమ్మత్​పురలో "మహిళలపై గౌరవం అంటే ఇదేరా" అంటున్నారు గ్రామస్థులు. ఆ ఊళ్లో ప్రతి వీధికీ మహిళ పేరే పెట్టారు. ఇంటింటా నామఫలకంపైనా వారి పేరే ముందు రాస్తారు.

ఆ ఊర్లోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు మహిళలవే!
author img

By

Published : May 20, 2019, 2:58 PM IST

పంజాబ్ బటిండా జిల్లాలోని హిమ్మత్​పుర గ్రామం ఇది. అన్ని పల్లెల్లానే వ్యవసాయమే ఇక్కడి వారందరికీ జీవనాధారం. జీవనశైలి, సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణ వంటి విషయాల్లోనూ అందరిలానే ఉంటారు ఇక్కడి ప్రజలు. ఒక్క విషయంలో మాత్రం హిమ్మత్​పుర ఎంతో భిన్నం. ఆ గ్రామానికి ఉన్న విశిష్టత ఏంటో తెలియాలంటే... అక్కడి వీధుల పేర్లు చూడాలి.

"మా ఊరు పేరు చెబితే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఇలా ఏ గ్రామంలోనూ జరగదు. మా ఊళ్లోనే మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో నామఫలకం​పై మహిళ పేరే ముందు ఉంటుంది. వీధులకూ మహిళల పేర్లే ఉంటాయి. మా ఊళ్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పూర్తి స్వేచ్ఛనిస్తారు. మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో మహిళలే బరిలో నిలుస్తారు. ముందు వారికే అవకాశం ఇస్తారు. మహిళనే సర్పంచిగా ఎన్నుకుంటారు."
-హిమ్మత్​పుర వాసి

"కేవలం మా గ్రామంలోనే ఇలా జరుగుతోంది. ఇది గొప్ప కార్యక్రమం. మా గ్రామంలో మహిళలకు చాలా గౌరవం ఉంటుంది."
-కరమ్​జీత్​ కౌర్, హిమ్మత్​పుర వాసి

హిమ్మత్​పుర బాగోగులు చూసుకోవటంలో గ్రామ క్లబ్ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తారు. వీధులన్నీ ఎంతో శుభ్రంగా ఉంచుతారు. ఊరి పనులన్నీ చక్కబెడతారు. యువకులే శ్రమదానం చేసి గ్రామంలో సుందరమైన పార్కు ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులంతా పెద్ద సంఖ్యలో సాయంత్రం నడకకు అక్కడికి వస్తారు.

Intro:Body:

sdsd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.