ETV Bharat / bharat

కల్తీ మద్యం ఘటనలో 86కి పెరిగిన మృతులు - పంజాబ్​లో కల్తీ మద్యం న్యూస్​

పంజాబ్​లో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అమరీందర్​​ సింగ్​.. న్యాయవిచారణకు ఆదేశించారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను సస్పెండ్​ చేసింది ప్రభుత్వం.

Punjab: Spurious liquor claims 45 lives
కల్తీ మద్యం ఘటనలో 45కు పెరిగిన మృతులు
author img

By

Published : Aug 1, 2020, 12:56 PM IST

Updated : Aug 1, 2020, 8:28 PM IST

పంజాబ్​లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 86కి చేరింది. మృతులు పంజాబ్​లోని అమృత్​సర్​, బటాలా, తర్న్​ తరణ్​ జిల్లాలకు చెందినవారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ శుక్రవారం తీవ్ర​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే న్యాయ విచారణకు ఆదేశించారు.

ఈ నెల 29 నుంచి శుక్రవారం వరకు 38 మంది చనిపోగా.. తాజాగా మృతుల సంఖ్య 86కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

సస్పెండ్​..

ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు ఎక్సైజ్​ అధికారులు, ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్​ వేటు వేసింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: 'సుశాంత్​ కేసును రాజకీయం చేయొద్దు'

Last Updated : Aug 1, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.