ETV Bharat / bharat

పంజాబ్: మంత్రి పదవికి​ సిద్ధూ రాజీనామా - పంజాబ్

నవ్​జోత్​ సింగ్ సిద్ధూ పంజాబ్​ మంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్​ 10న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి రాజీనామా లేఖ సమర్పించానని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. మంత్రివర్గ మార్పే రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.

సిద్ధూ రాజీనామా
author img

By

Published : Jul 14, 2019, 12:49 PM IST

Updated : Jul 14, 2019, 1:17 PM IST

మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్​ నేత నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ ప్రకటించారు. ఈ మేరకు జూన్​ 10న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించానని తెలిపారు. నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా బహిర్గతం చేశారు సిద్ధూ. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​కు కూడా లేఖను పంపిస్తున్నానని స్పష్టం చేశారు.

siddu resign
రాజీనామా పత్రం

శాఖ మార్పే కారణం!

పంజాబ్​ మంత్రివర్గంలో పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ అమాత్యులుగా పని చేశారు సిద్ధూ. జూన్​ 6న మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేశారు అమరిందర్​. పర్యటకానికి బదులుగా విద్యుత్​ శాఖను సిద్ధూకు కేటాయించారు. దీనిపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే అమరిందర్​తో సిద్ధూకు విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన శాఖ బాధ్యతలను సిద్ధూ స్వీకరించలేదు. జూన్​ 8న సీఎం సలహా బృందం నుంచీ వైదొలిగారు.

అధినాయకత్వంతో భేటీ

ఈ పరిణామాల నేపథ్యంలో జూన్​ 9న రాహుల్​ గాంధీతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ను కలిసినట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఆ సమయంలోనే లేఖ సమర్పించానని తెలిపిన సిద్ధూ అప్పుడు రాజీనామాపై స్పష్టత ఇవ్వలేదు.

siddu resign
కాంగ్రెస్ నేతలతో భేటీ

ఇదీ చూడండి: కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరాజు

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 14 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0559: Venezuela Guaido AP Clients Only 4220318
Guaido: Maduro regime falsely imprisoning his supporters
AP-APTN-0548: US NY Madison AP Clients Only 4220317
Outage hits Madison Square Garden J-Lo concert
AP-APTN-0453: US NY Cuomo Must credit WABC-TV; No access New York; , No use US Broadcast networks; No re-sale, re-use or archive 4220314
New York Gov urges residents to stay inside
AP-APTN-0406: US NY Power Cut 3 Must credit WABC-TV; No access New York; , No use US Broadcast networks; No re-sale, re-use or archive 4220312
Con Edison: NYC power to be restored by midnight
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 14, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.