దేశంలో కొవిడ్ మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌నే ఆయుధంగా ఎంచుకున్నాయి. పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. వైరస్‌ను పూర్తిగా కట్టడిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా పంజాబ్‌లో మే 3 నుంచి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.
4 గంటలు సడలింపు
కర్ఫ్యూ నేపథ్యంలో రోజూ 4 గంటలపాటు మాత్రమే సడలింపు ఉంటుందని సీఎం వీడియో సమావేశంలో చెప్పారు. ఈ మేరకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతినిస్తూ.. సంబంధిత మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలని సూచించింది.
బంగాల్‌లోనూ పొడిగింపు
కరోనాను అరికట్టేందుకు బంగాల్‌లోనూ లాక్‌డౌన్ కొనసాగింపునకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు విధించిన ఆంక్షలను మే చివరి వరకు అమల్లో ఉంచాలని నిపుణులు, డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించేందుకే మమత సముఖత వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!