ETV Bharat / bharat

'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం

author img

By

Published : Mar 6, 2020, 5:05 PM IST

Updated : Mar 6, 2020, 10:53 PM IST

తెలుగు వారి హృదయ స్పందన 'ఈనాడు' కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఉత్తమ వార్తా పత్రిక విభాగంలో చాణక్య పురస్కారాన్ని సొంతం చేసుకుంది. పబ్లిక్​ రిలేషన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ఈ అవార్డును అందజేసింది.

Public Relations council of India
పీఆర్​సీఐ 11వ ఛానక్య అవర్డ్​
'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం

నిత్యం ఉషోదయానికి ముందే ప్రపంచంలోని విశేషాలన్నింటితో పాఠకులను పలకరించే తెలుగు వారి హృదయ స్పందన "ఈనాడు"కు మరో విశిష్ట గౌరవం దక్కింది. పబ్లిక్​ రిలేషన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా(పీఆర్​సీఐ) ఇచ్చే చాణక్య పురస్కారాల్లో ఈ ఏడాది ఉత్తమ వార్తా పత్రిక అవార్డు లభించింది. "పీఆర్​ బీయాండ్​ 20:20" పేరిట బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్​ ఎడిటర్ ఎం.నాగేశ్వర రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

పురస్కారం వారికే అంకితం...

చాణక్య పురస్కారాన్ని ఈనాడు ఉద్యోగులు, చందాదారులు, పాఠకులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు నాగేశ్వర రావు.

"ఉత్తమ వార్తా పత్రిక విభాగంలో ఈనాడును పురస్కారానికి ఎంపిక చేసిన పీఆర్​సీఐకి మా ఛైర్మన్, పద్మ విభూషణ్ రామోజీ రావు, రామోజీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు. ఇది 25 వేల మంది ఉద్యోగులు, లక్షలాది మంది చందాదారులు, కోట్ల మంది పాఠకులకు దక్కిన గౌరవం. ఈనాడు తెలుగు ప్రజల హృదయం, ఆత్మ. ప్రజలు ఈనాడును 46 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్నారు. గత 42 ఏళ్లుగా తెలుగులో అగ్రగామి వార్తా పత్రికగా నిలిపారు. మంచి పాత్రికేయానికి అసలు సిసలు ఉదాహరణ ఈనాడు. సంస్థ వ్యవస్థాపకులు నిర్దేశించినట్లు... ప్రజా ప్రయోజనం, నిష్పక్షపాతం, సత్యం, విశ్వసనీయత, వృత్తి నిబద్ధత అనే పంచసూత్రాల ఆధారంగా ఈనాడు పనిచేస్తుంది."

-ఎం. నాగేశ్వర రావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్​ ఎడిటర్

కృష్ణ, గోదావరి వరదలు, ఒడిశా తుపాను, గుజరాత్ భూకంపం, తమిళనాడు సునామీ, కేరళ వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు 'ఈనాడు' ప్రత్యక్ష సాయం అందించడాన్ని నాగేశ్వర రావు గుర్తుచేశారు. తెలుగు ప్రజల సహకారంతో 'ఈనాడు' కేరళలో 121 ఇళ్లు నిర్మించి, ఇటీవల బాధితులకు అందజేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రింట్, టీవీ, రేడియో విభాగాలతో పాటు ఈటీవీ భారత్​ ద్వారా డిజిటల్ రంగంలోకీ ఈనాడు ప్రవేశించిందని చెప్పారు నాగేశ్వర రావు.

మరికొందరికి....

పీఆర్​సీఐ దేశంలోని ప్రముఖ కమ్యూనికేషన్​ ఎక్స్​ఛేంజ్​. భారత్​లోని 32 నగరాలు, పట్టణాల్లోని పీఆర్​, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, మీడియా, అడ్వర్​టైజింగ్, హెచ్​ఆర్​ నిపుణులను అనుసంధానం చేస్తుంది.

పబ్లిక్​ రిలేషన్స్​లో తమదైన ముద్ర వేసిన సంస్థలు, వ్యక్తుల్ని "పీఆర్​ బీయాండ్​ 20:20" సత్కరించింది పీఆర్​సీఐ. ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​కు 'కార్పొరేట్​ సిటిజన్ ఆఫ్​ ద ఇయర్​' అవార్డు అందించింది. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో మీడియా పర్సనాలిటీ ఆఫ్​ ద ఇయర్​ పురస్కారానికి రాజేశ్​ రైనాను ఎంపిక చేసింది.

Last Updated : Mar 6, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.