పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు రాజధాని చెన్నైలో నిరసనలు ఘర్షణలకు దారి తీశాయి. శుక్రవారం నగరంలోని వాషర్‌మాన్‌పేట్‌లో... నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తరలించడం వల్ల... ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నిరసకారులు రాళ్లు రువ్వడం వల్ల నలుగురు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసులు లాఠీఛార్జీ చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోసారి ఘర్షణలు తలెత్తకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అక్కడికి బలగాలు ఎందుకు?
జాతీయ జెండాలు చేతబూనిన ఆందోళనకారులు.. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో.. పోలీసుల వ్యవహార శైలిపై ప్రతిపక్ష డీఎంకే విమర్శలు గుప్పించింది. నిరసనలు ప్రశాంతంగా జరుగుతుంటే..అక్కడికి బలగాలు పంపించాల్సిన అవసరం ఏంటని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశ్నించారు. అటు.. పోలీసులపై దాడిని తమిళనాడు భాజపా ఖండించింది.
ఇదీ చూడండి: ఇద్దరు ఫేస్బుక్ రారాజులు త్వరలో కలవబోతున్నారు!