ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో తల్లి సోనియా గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేశారు. రైతుల పొలాలను కాపాడాలని ప్రధానికి సూచించారు.
"పాకిస్థాన్ దురాక్రమణ నుంచి ప్రజలను మీరు కాపాడుతున్నారు. ఇది ఓ పెద్ద విజయం. ప్రతిఒక్కరు సంతోషంగా ఉన్నారు. కానీ మీరు రైతుల పొలాలనూ కాపాడండి. ఇదీ జాతీయ వాదమే"- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రైతులు, యువత, మహిళలను నిర్లక్ష్యం చేయటం ఎలాంటి జాతీయ వాదమని ప్రధానిని ప్రశ్నించారు. హక్కులను ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తున్నారని విమర్శించారు. ప్రజల శక్తి ప్రభుత్వానికి తెలుసని, ఇచ్చిన హామీలను ఐదు సంవత్సరాల్లో నెరవేర్చనందునే మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: "రాహుల్‌ను ఎత్తుకున్న మొదటి వ్యక్తిని నేనే"