ట్విట్టర్లో తాజాగా చీరల ట్రెండ్ వైరల్ అవుతోంది. చీరకట్టులో ఉన్న తమ ఫోటోలను మహిళలు... శారీ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌తో పంచుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఈ జాబితాలో చేరిపోయారు.
22 ఏళ్ల క్రితం తన వివాహం జరిగిన రోజున పూజ చేసే సమయంలో దిగిన ఫోటోను ఆమె పోస్టు చేశారు. లేత గులాబీ బంగారు వర్ణంలోని బెనారస్ చీర కట్టుకొని ప్రియాంక సిగ్గుపడుతూ కూర్చుని ఉన్న ఈ ఫోటో.... పోస్టు చేసిన కొద్ది సేపటికే వైరల్ అయ్యింది.
పెళ్లిరోజు శుభాకాంక్షలు
ప్రియాంక ఫోటోలు వైరల్ కావడం వల్ల ఆమెకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. అయితే తమ పెళ్లి రోజు ఫిబ్రవరిలో అని ఆమె స్పష్టం చేశారు.
"రాబర్ట్ వాద్రా మీరు నన్ను విందు కోసం బయటకు తీసుకుని వెళ్లవచ్చు." అని మరో పోస్టు పెట్టారు.
ప్రేమకు పునాది..
ప్రియాంక పోస్టు వైరల్ కావడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. 'ప్రేమ, ఆనందం, మద్దతు' మన బంధానికి పునాది అని ట్విట్టర్ వేదికగా తన భార్యపై ప్రేమను కురిపించారు.
ట్రెండ్..
ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వనితల వరకూ శారీ ట్రెండ్ కొనసాగుతోంది. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో మహిళలు తమ చీరకట్టుతో ఉన్న ఫోటోలు ఉంచుతున్నారు.
తారాతోరణం
కాంగ్రెస్ నేత నగ్మ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది, భాజపా నేత నూపుర్ శర్మ సైతం చీరకట్టులో ఉన్న తమ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసి శారీ ట్విట్టర్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
ఇదీ చూడండి: కర్ణాటక విధాన సభలో నిలిచేదెవరో.. నేడే చూడండి