కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జవహార్‌లాల్ నెహ్రూ జన్మస్థలం అయిన అలహాబాద్‌లో ప్రచారాన్ని నిర్వహించి పురావస్తు శాలగా మారిన నెహ్రూ నివాసం 'ఆనంద్ భవన్'కు చేరుకుంటారు. అనంతరం జలమార్గం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వెళ్తారు.మార్గమధ్యంలో మిర్జాపూర్‌లోని వింద్యావాసిని ఆలయాన్ని సందర్శిస్తారు. వారణాసికి చేరిన అనంతరం కాశీ విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తారు.
ప్రియాంక ప్రచారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ వెల్లడించారు.