ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​పై గురువారం కీలక భేటీ - కరోనా వ్యాక్సినేషన్​

త్వరలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ గురువారం సమావేశం కానున్నారు. జనవరి 8న దేశంలోని అన్ని జిల్లాల్లో రెండో దశ డ్రైరన్​ ప్రారంభం కానున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

fake vaccine apps  under the name of  cowin app
జనవరి 7న ఆరోగ్యశాఖ మంత్రులతో హర్షవర్ధన్​ సమావేశం
author img

By

Published : Jan 6, 2021, 7:22 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో గురువారం కీలక సమావేశం నిర్వహించనుంది. టీకాకు సంబంధించిన కీలకాంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​... రాష్ట్రాల మంత్రులతో చర్చించనున్నారు.

జనవరి 8న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండో దశ డ్రైరన్​ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

నకిలీ కొవిన్​ యాప్స్​తో జాగ్రత్త

కొవిన్​ పేరుతో ఉన్న నకిలీ యాప్స్​ను డౌన్​లోడ్​ చేసుకోవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. తొందరపడి ఎవరూ తమ వ్యక్తిగత సమాచారాన్ని నకిలీ యాప్స్​లో పొందుపరచవద్దని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ఇదీ చదవండి : కో-విన్​తో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొందడమెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.