అయోధ్యలోని రామజన్మభూమి వద్ద రామ్లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. రాముడికి పూలమాల వేశారు. అనంతరం రాముడి విగ్రహానికి నైవేధ్యం పెట్టి హారతి ఇచ్చారు. ఆలయం బయట పారిజాత మొక్కను నాటారు.
కార్యక్రమంలో మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంట ఉన్నారు.