ETV Bharat / bharat

'దేశాభివృద్ధికి చోదక శక్తిగా ఈశాన్య భారతం' - మణిపూర్​ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన

దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఈశాన్య భారతం గొప్ప చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే ఈశాన్య భారతం..​ మంచి పర్యటక ప్రాంతంగా తయారవుతుందని చెప్పారు. మణిపుర్ నీటి సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మోదీ.

Prime Minister Narendra Modi
చోదక శక్తిగా మారే సత్తా ఈశాన్యానికి ఉంది- మోదీ
author img

By

Published : Jul 23, 2020, 12:05 PM IST

Updated : Jul 23, 2020, 12:25 PM IST

భారత దేశ వృద్ధికి చోదక శక్తిగా మారే సామర్థ్యం ఈశాన్య భారతానికి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈశాన్యంలో పూర్తి స్థాయిలో శాంతి నెలకొందని అన్నారు.

మణిపుర్​ నీటి సరఫరా ప్రాజెక్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన ప్రధాని... కరోనా మహమ్మారితో పాటు వరద ముంపును ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాలకు యావద్దేశం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు సంతాపం తెలిపారు.

"మణిపుర్​లో దిగ్బంధాలు చరిత్రలో కలిసిపోయాయి. అసోంలో దశాబ్దల హింస ఆగిపోయింది. త్రిపుర, మిజోరాంలో యువత హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టారు. బ్రూ-రియాంగ్ శరణార్థులు ఇప్పుడు మెరుగైన జీవితం వైపు పయనిస్తున్నారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

దేశ సాంస్కృతిక వైవిధ్యానికి, దృఢత్వానికి ఈశాన్య భారతదేశం గొప్ప చిహ్నమని కొనియాడారు మోదీ. ఆధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో పర్యటకం గణనీయంగా వృద్ధి చెందుతుందని అన్నారు.

"ప్రాంతాల అనుసంధానమే పురోగతికి కీలకం. ఈశాన్య భారతదేశంలో కనెక్టివిటీ పెంచడం చాలా ముఖ్యం. జీవన సౌలభ్యం కోసమే కాకుండా ఆత్మనిర్భర్​ భారత్​ లక్ష్యాన్ని సాధించేందుకూ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కరోనాను నియంత్రించేందుకు మణిపుర్​ ప్రభుత్వం రాత్రింబవళ్లు పనిచేస్తోందని కితాబిచ్చారు ప్రధాని.

ప్రాజెక్టు స్వరూపం

మణిపుర్​లోని 16 జిల్లాల్లో ఉన్న 2.8 లక్షల ఇళ్లతో పాటు గ్రేటర్ ఇంపాల్ పరిధిలో ఉన్న నివాసాలకు నల్లా నీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ. 3054.58 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు. న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఇచ్చిన రుణం ద్వారా నిధులు సేకరించారు.

ఇదీ చదవండి- కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే 45,720 కేసులు

Last Updated : Jul 23, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.