కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమంగా ఉంది. శ్వాస సంబంధిత సమస్యతో ఈ నెల 9న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు జైట్లీ. అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉన్నారు.
రాష్ట్రపతి పరామర్శ...
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో 66 ఏళ్ల జైట్లీని పరామర్శించారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో కోవింద్‌తో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్, ఆరోగ్య సహాయమంత్రి అశ్విని చౌబే ఉన్నారు.
గత శనివారం జైట్లీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. అనంతరం మాజీ ఆర్థిక మంత్రి ఆరోగ్యం మెరుగుపడుతోందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి:- గర్భవతి భార్య సహా కుటుంబాన్ని చంపి ఆత్మహత్య