ETV Bharat / bharat

'చంద్రయాన్​-2' ఏర్పాట్లు చకచకా: ఇస్రో

చంద్రుడిపైకి ప్రయోగించనున్న 'చంద్రయాన్​-2' ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు జీఎస్​ఎల్వీ-మార్క్​3 చందమామ వైపు దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​. 2021లో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.

'చంద్రయాన్​-2' ఏర్పాట్లు చకచకా: ఇస్రో
author img

By

Published : Jul 14, 2019, 5:47 AM IST

భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగం.. 'చంద్రయాన్​-2'కు కౌంట్​డౌన్​ మొదలయ్యింది. సోమవారం తెల్లవారుజామున ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె. శివన్‌ . చంద్రయాన్‌-2 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు.

డాక్టర్​ కె. శివన్​, ఇస్రో ఛైర్మన్​

" సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్​-2ను ప్రయోగించనున్నాం. అందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రయోగం కోసం జీఎస్​ఎల్వీ-మార్క్​-3 వాహకాన్ని వినియోగించాం. దాదాపు రెండు నెలల తర్వాత చంద్రయాన్​-2 చంద్రుడిపై అడుగుపెట్టనుంది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్​-1 కు ఈ ప్రయోగం కొనసాగింపు​ లాంటింది. చంద్రుడి పుట్టుక, పరిమాణంపై పరిశోధించడమే ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం."
- డాక్టర్​ కె. శివన్​, ఇస్రో ఛైర్మన్​

వర్షం కారణంగా చంద్రయాన్​-2 ప్రయోగానికి ఆటంకం ఏర్పడొచ్చనే అనుమానాలను శివన్​ కొట్టిపారేశారు. జీఎస్​ఎల్వీ మార్క్​-3 వర్షాన్ని సైతం తట్టుకోగలదని స్పష్టం చేశారు. చంద్రయాన్​-2 ప్రయోగానికి మొత్తం రూ.1000 కోట్లు వ్యయమైనట్లు తెలిపారు.

2021లో గగన్​యాన్​

మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే భారత ప్రాజెక్టు గగన్​యాన్​ గురించి విలేకర్లు ప్రశ్నించగా... 2020 డిసెంబర్​, 2021 జులైలో రెండుసార్లు మానవ రహిత గగన్​యాన్​ను ప్రయోగిస్తామన్నారు. ఆ తర్వాత 2021 డిసెంబర్​లో మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు కసరత్తులు చేస్తున్నామని శివన్​ స్పష్టం చేశారు.

Bhadrak (Odisha), Jul 13 (ANI): More than 2 dozen dairy farmers staged protest against state-owned Odisha State Cooperative Milk Producers Federation (OMFED). They spilled litres of milk on streets as a mark of protest. OMFED has reportedly refused to accept dairy farmers' milk citing low quality.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.