ETV Bharat / bharat

'కొవాగ్జిన్'​ రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు

author img

By

Published : Aug 31, 2020, 1:53 PM IST

'కొవాగ్జిన్'​ రెండో దశ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశ దాదాపు పూర్తికావస్తున్న వేళ.. రెండో దశ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపింది ఒడిశాలోని ఐఎంఎస్​-ఎస్​యూఎమ్​ ఆస్పత్రి.

preparations-on-for-second-phase-of-human-clinical-trial-of-covaxin-vaccine
మానవులపై రెండోదశ ప్రయోగానికి 'కొవాగ్జిన్'​ సిద్ధం!

కరోనా నియంత్రణ కోసం భారత్​ బయోటెక్​ రూపొందించిన కొవాగ్జిన్​ టీకా రెండో దశ ప్రయోగాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనేశ్వర్​ ఐఎంఎస్​-ఎస్​యూఎమ్​ ఆస్పత్రి ప్రతినిధులు వెల్లడించారు.

"మనుషులపై కొవాగ్జిన్ రెండో దశ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నాం . తొలి దశలో కొవాగ్జిన్ ప్రయోగించిన వలంటీర్ల రక్తం నమూనాలు స్వీకరించాం. వారిపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపిందో అధ్యయనం చేస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయో పరిశీలించాం. ఇప్పటివరకైతే తొలి వ్యాక్సిన్ పొందినవారిపై ఎలాంటి దుష్ప్రభావం కనిపించలేదు. "

-డా. ఇ వెంకటరావు, ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్

రెండో దశ ప్రయోగంలో భాగస్వాములు కావాలనుకునే వలంటీర్లు.. http://ptctu.soa.ac.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు డా. రావు.

ఇదీ చదవండి: 'కొవాగ్జిన్'​కు మరో కీలక అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.