మాలేగావ్ పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్కు ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో భాగంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు కావాలని ప్రజ్ఞా చేసిన అభ్యర్థనను ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయముర్తి తిరస్కరించారు. వారంలోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు న్యాయమూర్తి వీ ఎస్ పదల్కర్.
ఇటీవలే ఎంపీగా ఎన్నికైనందు వల్ల పార్లమెంటులో కొన్ని లాంఛనాలు పూర్తి చేయాలని... అందుకే కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు ప్రజ్ఞాసింగ్ పేర్కొన్నారు. ఈ దశలో విచారణకు సాధ్వీ ప్రజ్ఞా హాజరవ్వడం అవసరమన్న న్యాయమూర్తి... ఆమె వినతిని తిరస్కరించారు.
మినహాయింపునకు తొలుత న్యాయమూర్తి అంగీకరించారు. కానీ సాక్ష్యులు ఆధారాలు సమర్పించే సందర్భంలో నిందితురాలు కోర్టులో ఉండటం ఆవసరమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పాక్ ఆటగాళ్లకు భారత కెప్టెన్ ఆదర్శం'